బాలల మ్యాపింగ్ వర్క్ షాప్, Children's workshop ##OSMGeoweek
Posted by Upendrakarukonda on 15 November 2016 in Telugu (తెలుగు).ఓపెన్ స్ట్రీట్ మ్యాప్ జియోవీక్ భాగంగా ఈ బాలల దినోత్సవముకి మా మ్యాప్ బాక్స్ తరపున పాఠశాలకి వెళ్లి 6వ తరగతి విద్యార్థులకి జియోగ్రఫీ నేర్పించాలనుకున్నాం. నాగశెట్టి హళ్లి కన్నడ గవర్నమెంట్ పాఠశాలలో ఈ కార్యక్రమం చేపట్టాలని నిశ్చయించుకున్నాం. నవంబర్ 12వ తేదీన ఆ పాఠశాల యాజమాన్య అనుమతితో మూడు గంటల సేపు పిల్లలకి జియోగ్రఫీ గురుంచి ఆసక్తికరమైన విషయాలు నేర్పించాం.
ఖండాలు, మహా సముద్రాల పేర్లు , ప్రపంచ మరియు దేశ పటాలను చూపించి, వాటిలో నగరాలను గుర్తించడం వంటివి నేర్పించాం. పిల్లల చలాకీతనం, చురుకుతనం మమ్మల్ని ఎంతగానో అబ్బురపరిచింది. గ్లోబ్ యొక్క ప్రాముఖ్యతను, దిక్కులు వల్ల ఉపయోగాలను వివరించాం. వారికి ఇష్టమైన ప్రదేశాలను అడిగి వాటిని బోర్డు పై అతికించిన ప్రపంచం మరియు దేశ పటిమలో గుర్తించమని చెప్పాము.
ప్రతి ఒక్క విద్యార్థిని వారి ఇంటి నుంచి పాఠశాలకి గల దారి, దారిలో ఉండే పరిసరాలు కాగితం మీద బొమ్మగా వేయమన్నాం. అందరు చక్కని ప్రతిభ కనబర్చారు. ఆ తర్వాత విద్యార్థి గీసిన బొమ్మను వాళ్ళతోనే తరగతి అందరికి వివరంగా చెప్పించాం. దీని ద్వారా వాళ్ళ ఆత్మ విశ్వాసం ఎంతో పెరిగింది. అలాగే మ్యాప్ యొక్క లాభాలు కూడా తెలుసుకున్నారు. కార్యక్రమంలో భాగంగా నిర్వహించబడ్డ పోటీలలో విద్యార్థులకు బహుమతులు బహుకరించాము.
ఏళ్ళ క్రితం నాటిన విత్తనం ఎలా మహా వృక్షం అయ్యి మానవాళికి ఉపయోగపడుతుందో, పిల్లలో కూడా చిన్నతనంలో మనం పెంచిన సామాజిక విలువలే వాళ్ళని ఒక గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దుతాయి. చిన్నతనం నుండే జియోగ్రఫీ మీద ఆసక్తి, మక్కువ పెంచగలిగితే భవిష్యత్తులో ఓపెన్ స్ట్రీట్ మ్యాప్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తారని మా ప్రగాఢ నమ్మకం. ఆంధ్ర ప్రదేశ్ విద్యార్ధులకు కూడా ఓపెన్ స్ట్రీట్ మ్యాప్ మీద అవగాహనా పెంచి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి మన దేశ అభివృద్ధి లో భాగం అవ్వాలని కమ్యూనిటీని కోరుకుంటున్నాము.
Discussion
Comment from PlaneMad on 15 November 2016 at 13:23
Such an excellent effort. Students in Government schools in India hardly get any resources and it makes a huge difference to the interest they have in class with opportunities like these. Beautiful!
Comment from SomeoneElse on 15 November 2016 at 15:12
Those images are 5Mb each. I’d suggest using much, much smaller ones to avoid using up everyone’s mobile bandwidth!
Comment from GOwin on 16 November 2016 at 11:32
great photos! congratulations for running an event.
Comment from Christian Ledermann on 16 November 2016 at 13:17
Can you provide an english translation?
Comment from Godfan on 19 July 2019 at 08:14
A very good Initiation and team work Upendra and Team, Appreciate all who are part of this workshop. :)