Image Source: Pinterest
Vishakapatnam
ఉల్లాసభరితమైనటువంటి తీర ప్రాంతంతో విశాఖపట్టణం ఎల్లప్పుడూ నిత్యనూతనంగా మరియు ప్రశాంతంగా ఉంటుంది. నిత్యం అభివృద్ధి చెందుతున్న నగరంతో పాటు డేటా కూడా ఎప్పటికప్పుడు మెరుగుపరచడం అనివార్యం. విశాఖపట్టణంలోని కూర్మన్నపాలెం నా జన్మస్థలం అవ్వడం వలన, నాకున్న అవగాహనతో ఈ ప్రాంతాన్ని మ్యాప్ చేశాను. గతం లో ఇక్కడ మ్యాప్ చేయని ఆస్పత్రులు, ఎటిఎం’స్ ,సినిమా థియేటర్స్ వంటి ప్రాథమిక సౌకర్యాలు మ్యాప్ చేయడం జరిగింది. అభివృద్ధి చెందుతున్న పారిశ్రామిక ప్రాంతం అయినప్పటికీ జాతీయ రహాదారుల క్రమం సరిగ్గా లేకపోవడం వలన దీని మీద పని చేయడం జరిగింది. కాలంతో పాటు జరుగుతున్న పట్టణీకరణ మరియు వ్యాపారీకరణ గమనార్హం. పూర్వం మామిడి తోట అయినటువంటి ప్రదేశాలు కూడా పట్టణీకరణ వల్ల ఆధునిక అడవిలా మారిపోయింది. భవిష్యత్తులో పారిశ్రామిక మరియు గ్రామీణ పరిసరాలలో ప్రాధమిక వసతులని మ్యాప్ చేయాలనీ ఆకాంక్షిస్తున్నాను.